Telugu Neetivakyalu - 11
201. మన ఆనందాన్ని మరొకరికి పంచాలంటే త్యాగం కావాలి.
202. కష్టకాలంలో మనిషికి గతమే పెట్టుబడి.
203. మనిషి ఎప్పుడు ఒంటరివాడే, ఆతని ఆలోచనలే అతని నేస్తాలు.
204. మనిషి చేసిన పాపపుణ్యాలు దూదిలొ దాచబడిన నిప్పుకణాలు.
205.
చేతిలో ఉన్న దీపాన్ని వెలిగించి చీకటిలో ముందుకు సాగాలి.
206. నియంత్రణలో ఉన్న మనస్శే మనకు నిజమైన మిత్రుడు.
207. తృప్తిలేని వాణ్ణి నీటిలో ఉంచినా దాహం తీరదు.
208.
ఆశలేనివాణ్ణి ఐశ్వర్యంలో ముంచినా మోహం అంటదు.
209.
ఒక్క చెడు సంకల్పం హృదయం మొత్తాన్ని కాలుషితం చేస్తుంది.
210.
సద్గుణాలు పెరిగేకొద్దీ దుర్గుణాలు దూరామౌతుంటాయి.
211.
ప్రపంచంలో వ్యర్ధమైన పనులంటూ ఏవీ లేవు.
212.
దేని విలువానైనా మనిషి పొందినప్పటి కంటే కోల్పోయినప్పడే బాగా
గుర్తిస్తాడు.
213.
వైఫల్యాలు కూడా ఓ విధమైన సంపదే! సాధించబోయే విజయాలకు అదో రకమైన
పెట్టుబడి.
214.
ఆలోచించడానికి తీరికలేకపోతే సమస్యలనేవి మనిషిని బాధించవు.
215.
శ్రమపడటానికి సిద్ధపడటమే సమస్య లన్నింటికీ పరిష్కారం.
216.
నిరాశ నిస్పృహలు లేనివాడే నిజమైన ధనవంతుడు.
217.
ఆవేశాన్ని కాని, ఆలోచనను కాని వెంటనే వ్యక్తం చేయకూడదు.
218.
అధికారంతో కొందరినే జయించవచ్చు, అణకువతో అందరినీ జయించవచ్చు.
219.
నేడు ఇతరులకు నీవేమి పెడుతున్నావో అదే రేపు నీకు లభిస్తుంది.
220.
ప్రతిదానినీ విశ్వాసించేవాడు, అన్నింటినీ అనుమానించేవాడు ఈ ఇద్దరూ
దేనినీ సాధించలేరు.
Comments
Post a Comment