Telugu Neeti vakyalu - 2

    21. శ్రమించని మేధావి వర్షించని మేఘ౦.
    22. చదువుతో జ్ఞానం - సాదనతో నైపుణ్యం.
    23. చీకటి తర్వాత వచ్చిన వెలుగు అమితమైన ఆనందాన్నిస్తుంది.
    24. మంచి ప్రారంభం సగం జయం వంటిది.
    25. ఓర్వలేనితనానికి హృదయావేదన ప్రధమ శిక్ష.
    26. ఒక మౌనం  నూరు మాటల్ని  జయించగలదు.
    27. అధిక ప్రసంగం అబద్ధాలకు స్వగృహం.
    28. జీవితంలో ప్రతిక్షణానికి విలువ ఉన్నది.
    29. సమస్యను గుర్తించామంటే - సగం పరిష్కారమైనట్లే.
    30. పొగడ్త పన్నిరులాంటిది. దాన్ని వాసన చూసి వదిలేయాలి గాని తాగుతూ కూర్చోకూడదు.
    31. ప్రతి సందేహానికి సమాధానము ఉంటుంది.
    32. కష్టాలకు చలించని వాడే స్ధితప్రజ్ఞుడు.
    33. నిజం నిప్పులాంటిది - అబద్ధం నీటి బుడగాలంటిది.
    34. నాది నాది అనుకున్నది ఎప్పుడు మనది కాదు.
    35. గర్వం శత్రువుల్ని పెంచుతుంది.
    36. పువ్వులోని సువాసన, మనిషిలోని ప్రతిభ ఎంత దాచిన దాగవు.
    37. బుద్ధిహినుడైన స్నేహితునికన్నా -బుద్ధిమంతుడైన శత్రువు మేలు.
    38. స్వేచ్ఛ లేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది.
    39. సంతోషమే ఆరోగ్యం, దిగులే జబ్బు.
    40. విమర్శలన్నింటిలో ఉత్తమమైనది ఆత్మ విమర్శ.

Comments

Popular posts from this blog

Brahmarshi Subhash Patriji Biography

Gautama Buddha Quotes