Telugu Neetivakyalu -1

  1. మనిషి బట్టే ఆతడి స్నేహితులు ఉంటారు.
  2.  వినయ సంపన్నుడు తనను గురించి తాను ఎప్పుడూ చెప్పుకోడు.
  3. బంగారుకు నిప్పు పరీక్షయితే బలమైన మనిషికి ప్రతికూల పరిస్థితే పరీక్ష.
  4. నిరాడంబరం కన్నా గొప్పది ఏదీలేదు.
  5. గొప్పతనం ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటుంది.
  6. అహంభావం చికిత్సకు అందని రోగం.
  7. గొప్పవారి గొప్పతనం వారు తమకంటే తక్కువ వారితో వ్యవహరించే తీరును బట్టి తెలుస్తుంది.
  8. గౌరవం లేకపోతే ప్రేమ ఎక్కువ కాలం కొనసాగదు.
  9. ఆలోచించని వారికి కన్పించేది అంధకరమే.
  10. అవసరం వచ్చినప్పుడు అసలు స్నేహితుడెవరొ తెలుస్తుంది.
  11. అనామకుడికి కూడా ఓ మంచిరోజు ఉంటుంది.
  12. అందరితో మంచిగా ఉండాలనుకోవడం అవకాశవాదమే తప్ప ఆచరణియ౦ కాదు.
  13. ఏదో ఒక పని కోసం ప్రారంభమైన స్నేహం చిరకాలం కొనసాగాదు.
  14. గతం చూసి గర్వించడం తప్పు.
  15. కోపాన్ని శాంతంతో జయించవచ్చు.
  16. దుష్టుని మంచితనంతో జయించవచ్చు.
  17. దురాశ దుఃఖానికి చేటు.
  18. పరధనం పాముతో సమానం.
  19. తప్పు చేసినవారికి, అప్పు చేసిన వారికి ముఖ౦ చెల్లదు.
  20. నేర్చిన బుద్ధి కాల్చినా పోదు.

Comments

Popular posts from this blog

Brahmarshi Subhash Patriji Biography

Gautama Buddha Quotes

Telugu Neeti vakyalu - 2