Telugu Neetivakyalu - 9

  161. ఓటమికి భయపడకు - గెలుపుకి గర్వపడకు.
  162. ఒక్క దీపం లక్ష దీపాలను వెలిగిస్తుంది.
  163. అల్ప విషయాలు అల్ప మనస్సులను ఆకర్షిస్తాయి.
  164. చీకటిని కాంతి మింగినట్లే, అజ్ఞానాన్నిజ్ఞానం మింగుతుంది.
  165. అజ్ఞానాంకన్నా నిర్లక్ష్యం ఎక్కువ కీడు చేస్తుంది.
  166. వెయ్యి మైళ్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమౌతుంది.
  167. ఊరక లభించిన క్షీరాన్నం కంటే కష్టార్జితమైన భిక్ష్యాన్నం మేలు.
  168. ప్రయత్నిస్తే కానీ ఎవరి అదృష్టం వారికి తెలీదు.
  169. గొప్ప పనులు గురించి కలలు కనడం కాదు, వాటిని సాధించి చూపించాలి.
  170. యాచన వల్ల మానవుడు అల్పుడౌతాడు.
  171. గుణాన్ని మించిన బలం లేదు.
  172. గమ్యము,గమనము రెండు ఉత్తమమైనావై ఉండాలి.
  173. ప్రగల్భాలు అంతమైన చోట హుందాతనం ప్రారంభంమౌతుంది.
  174. గడచిన ప్రతిరోజూ మనమెదైన నేర్చుకునేదిగా ఉండాలి.
  175. ఆచరణ లేని విజ్ఞానం దీపం ముందు కూర్చుని కళ్ళు మూసుకోవడం వంటిది.
  176. శ్రమజీవికి జగమంతా లక్ష్మి నివాసం.
  177. చెప్పడం వేరు చెయ్యడం వేరు.
  178. వైఫల్యం చవి చూడకుండా విజయం చేకూరదు.
  179. దూరలోచన పాపాచరణ వంటిది.
  180. పాండిత్యం కన్నా వ్యక్తిత్వం మిన్న.

Comments

Popular posts from this blog

Brahmarshi Subhash Patriji Biography

Gautama Buddha Quotes

Telugu Neeti vakyalu - 2