Telugu Neetivakyalu - 3

    41. విజయం పొందాలన్న మనిషి నిరాశపడకూడదు.
    42. విజయానికి పునాదివేసేది క్రమశిక్షణ మాత్రమే.
    43.ముర్ఖుని వాదనతో జయించడం అసాధ్యం.
    44. మార్పులేకుండా ఉండడం ప్రకృతికి, జీవితానికి విరుద్ధం.
    45. లక్ష్యం మంచిదైతే నిర్లక్ష్యం చేయకు.
    46. ఓర్పు చేదుగా ఉన్నా ఫలితం మధురంగా ఉంటుంది.
    47. ఉపకారం చేయలేకపోయినా అపకారం చేయకు.
    48. మంచి మాటలు విన్పించుకోని వాడే నిజమైన చెవిటివాడు.
    49. మనసుంటే  మార్గముంటుంది.
    50. నింద నిజమైతే సరిదిద్దుకోవాలి.
    51. నీవు తిన్నది మట్టిపాలు - ఇతరులకు ఇచ్చింది నీ పాలు.
    52. చింతలు లేని వాడు సంతలో కూడా నిద్రపోగలడు.
    53. కోపానికి బానిస కాకూడదు.
    54. సంపదలు ఎన్ని ఉన్న -  శాంతి లేకుంటే సమస్తం సున్న.
    55. ఆపదాలో ఆదుకోవడానికి ఆహ్వానం అవసరం లేదు.
    56. భోగభాగ్యాలు లేవని చింతించకు - దారిద్రబాధలు లేవని సంతోషించు.
    57. ఆవేశంతో ఆలోచించకూడదు.
    58. మంచి పని చేయడానికి నీరసం పనికిరాదు.
   59. ఆవేశం అన్ని అనర్ధాలకు మూలం.
   60. ఎన్ని కోట్లు ఉన్నా ఊపిరిపోగానే - ఊరి బయట పారేస్తారు.

Comments

Popular posts from this blog

Brahmarshi Subhash Patriji Biography

Gautama Buddha Quotes

Telugu Neeti vakyalu - 2