Telugu Neetivakyalu - 8
141. మాటలకన్నా - ఆచరణ మిన్న.
142. సాహసం చేయకుండా ఏమీ లభించదు.
143. మనసుకు మించిన న్యాయస్థానం లేదు.
144. సోమారిగా ఉంటే దురాలోచనలు మనస్సును కలవరపరుస్తాయి.
145. మనశ్శాంతిని కోరుకుంటే తప్పులు ఎన్నడం మానుకోవాలి.
146. మనస్సును ఏకాగ్రపరుచుకుంటే సర్వం సమకూరుతుంది.
147. విద్య లేనివాడు వింత పశువు.
148. కష్టాలకు ఓర్చుకుంటేనే సుఖాలు దక్కుతాయి .
149. విద్యాధనం దొంగల చేతికి చిక్కనిది, దానము చేసిన తరగనిది.
150. శాంతములేక సౌఖ్యము లేదు.
151. దురాశ దుఃఖ౦ - నిరాశ మరణం.
152. శాంతం సముద్రం కన్నా చల్లనైనిది.
153. లక్ష్యం లేనువాడు నిజమైన పేదవాడు.
154. పని మానవుడి విచారాన్ని పోగోడుతుంది.
155. ఉత్తమ జీవితానికి మార్గం విజ్ఞానం.
156. శ్రమించుటలోనే ఆనందం ఉంది.
157. ప్రియభాషికి శత్రువు లేడు - పరుషభాషికి మిత్రుడు లేడు.
158. ఎంత ఉపయోగించినా తర"గని"ది విజ్ఞానం.
159. రేపటి పనిని ఈరోజే చేయాలి.
160. ఇతరులను నువ్వు గౌరవిస్తే, నిన్ను ఇతరులు గౌరవిస్తారు.
Comments
Post a Comment