Telugu Neetivakyalu - 12
221.
మన వ్యక్తిత్వం పరీక్షించబడేది సమస్యల ద్వారానే.
222.
తృప్తిలేనివాడు తన ప్రశాంతతను తానే దూరం చేసుకుంటాడు.
223.
ఒక చిరునవ్వు మన కష్టాన్ని తొలగిస్తుంది.
224.
తక్కువ మాట్లాడు - ఎక్కువ ఆలోచించు.
225.
గురువంటే చీకటి తెరల్ని చీల్చే దీపం.
226. ఆపదలు వచ్చినపుడు ఆదుకున్నావారే నిజమైన ఆప్తులు.
227.
ఇచ్చింది మరిచిపోవడం, పుచ్చుకొన్నది జ్ఞాపకముంచుకోవటమే నిజమైన
స్నేహం.
228. ఏ విషయాన్ని అయినా స్పష్టంగా చూడగలిగిన వ్యక్తి నిజమైన మేధావి.
229. ఒక మనిషి విలువ అతని మాటల నిలకడను బట్టి తెలుస్తుంది.
230.
దేనికీ భయపడకు, తప్పు చేయడానికి తప్ప.
231.
పరిపూర్ణత అనేది ఆచరణ నుంచే మాత్రమే వస్తుంది.
232.
చేరాదిసిన వారినే మింగేస్తుంది 'అసూయ'.
233.
చెడుకు ఒక్కక్షణం చాలు - మంచికి జీవితకాలం కూడా చాలదు.
234.
జీవితం ఆనందంగా ఉండాలంటే నీకంటే తక్కువ వారితో పోల్చుకో.
235.
జీవితం నిరాడంబరంగాను, ఆశయాలు ఉన్నతంగాను ఉండాలి.
236.
అన్నిటికన్నా కష్టమైన పని - ఇచ్చిన మాట నిలుపుకోవడమే.
237.
చెంత చేరితే శత్రవునైనా క్షమించాలి.
238.
కలనైనా పరని౦ద చేయకూడదు.
239.
తన కోపమే తన శత్రువు.
240.
దుష్టుని సహవాసం భ్రష్టులుగా చేస్తుంది.
241.
ధనం గల లోభి కంటే వినయం గల పేద మేలు.
242.
మంచివాడు బానిసగా ఉన్నా స్వతంత్రుడే, చెడ్డవాడు రాజైన బానిసే.
243.
జీవితానికి హద్దు ఉంది కానీ జ్ఞానానికి లేదు.
244.
మనిషి ఎంత ఎదిగిన ఒదిగే ఉండాలి.
245.
ధనం లేకపోతే దుఃఖం - అతిగా ఉంటే భయం.
246.
సోమరితనం మనిషి మెదటి శత్రువు.
247.
మనిషి వ్యక్తిత్వాన్ని కష్టకాలం నిర్ణయిస్తుంది.
248.
నువ్వు ఏది నాటితే దాన్నే కోసుకుంటావు.
249.
కోపం, ద్వేషం మంచి ఆలోచనల్ని అడ్డగిస్తాయి.
250.
గ్రహాబలం, గృహాబలం కన్నా ఆత్మబలం మిన్న.
251.
స్వయంకృషి ద్వారానే మార్పు సాధ్యం.
252.
ఏ పని చేయడానికైనా ఉండవలసింది దృఢసంకల్పం.
Comments
Post a Comment