Posts

Showing posts from October, 2012

Telugu Neetivakyalu - 10

  181. స్వాభిమానం కలవారికి అపకీర్తి మృత్వవు కన్నా దుర్భరం.   182. నవలేని ముఖం నిరుపయోగమైన ముఖం.   183. అజ్ఞానాన్ని తెలుసుకోవటమే జ్ఞానం.   184. వైఫల్యం కొత్త ప్రేరణకు పునాది కావాలి.   185. వ్యక్తిత్వం లేని జీవితం వ్యర్ధం.    186. సోమరితనం అసమర్ధతకు దారి తీస్తుంది.   187. ఆశయాలు కోసమే జీవించాలి. ఆశల కోసం కాదు.   188. జీవితంలో మంచిని సాధించటం ముఖ్యం .   189. సంతోషాన్ని ఇచ్చేది ప్రశాంతమైన మనస్సు.   190. వాయదలు - విజయానికి బద్ధశత్రువు.   191. ధర్మం దగ్గర ఎప్పుడూ జయం ఉంటుంది.   192. కష్టాలు పడకుండా ఉత్తముడు కాలేడు.   193. మనిషికి మాటలతో బాధించినా హింసే.   194. అశ్రద్ధ మానవుని అగాధాంలోకి నెట్టేస్తుంది.   195. మర్యాదకంటే మించిన విలువ లేదు.   196. అహంభావం అపజయానికి మూలం.   197. క్షమాసిలుడు లోకాన్ని జయిస్తాడు.   198. గొప్ప పనులకు కావలసింది ఓపిక.   199. విజయానికి పునాది క్రమశిక్షణ.   200. నైపుణ్యం నిప్పుకణమైతే నిర్లక్ష్యం నీటిచుక్క.

Telugu Neetivakyalu - 9

  161. ఓటమికి భయపడకు - గెలుపుకి గర్వపడకు.   162. ఒక్క దీపం లక్ష దీపాలను వెలిగిస్తుంది.   163. అల్ప విషయాలు అల్ప మనస్సులను ఆకర్షిస్తాయి.   164. చీకటిని కాంతి మింగినట్లే, అజ్ఞానాన్నిజ్ఞానం మింగుతుంది.   165. అజ్ఞానాంకన్నా నిర్లక్ష్యం ఎక్కువ కీడు చేస్తుంది.   166. వెయ్యి మైళ్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమౌతుంది.   167. ఊరక లభించిన క్షీరాన్నం కంటే కష్టార్జితమైన భిక్ష్యాన్నం మేలు.   168. ప్రయత్నిస్తే కానీ ఎవరి అదృష్టం వారికి తెలీదు.   169. గొప్ప పనులు గురించి కలలు కనడం కాదు, వాటిని సాధించి చూపించాలి.   170. యాచన వల్ల మానవుడు అల్పుడౌతాడు.   171. గుణాన్ని మించిన బలం లేదు.   172. గమ్యము,గమనము రెండు ఉత్తమమైనావై ఉండాలి.   173. ప్రగల్భాలు అంతమైన చోట హుందాతనం ప్రారంభంమౌతుంది.   174. గడచిన ప్రతిరోజూ మనమెదైన నేర్చుకునేదిగా ఉండాలి.   175. ఆచరణ లేని విజ్ఞానం దీపం ముందు కూర్చుని కళ్ళు మూసుకోవడం వంటిది.   176. శ్రమజీవికి జగమంతా లక్ష్మి నివాసం.   177. చెప్పడం వేరు చెయ్యడం వేరు.   178. వైఫల్యం చవి చూడకుండా విజయం...

Telugu Neetivakyalu - 8

  141. మాటలకన్నా - ఆచరణ మిన్న.   142. సాహసం చేయకుండా ఏమీ లభించదు.   143. మనసుకు మించిన న్యాయస్థానం లేదు.   144. సోమారిగా ఉంటే దురాలోచనలు మనస్సును కలవరపరుస్తాయి.   145. మనశ్శాంతిని కోరుకుంటే తప్పులు ఎన్నడం మానుకోవాలి.   146. మనస్సును ఏకాగ్రపరుచుకుంటే సర్వం సమకూరుతుంది.   147. విద్య లేనివాడు వింత పశువు.   148. కష్టాలకు ఓర్చుకుంటేనే సుఖాలు దక్కుతాయి .   149. విద్యాధనం దొంగల చేతికి చిక్కనిది, దానము చేసిన తరగనిది.   150. శాంతములేక సౌఖ్యము లేదు.   151. దురాశ దుఃఖ౦ - నిరాశ మరణం.   152. శాంతం సముద్రం కన్నా చల్లనైనిది.   153. లక్ష్యం లేనువాడు నిజమైన పేదవాడు.   154. పని మానవుడి విచారాన్ని పోగోడుతుంది.   155. ఉత్తమ జీవితానికి మార్గం విజ్ఞానం.   156. శ్రమించుటలోనే ఆనందం ఉంది.   157. ప్రియభాషికి శత్రువు లేడు - పరుషభాషికి మిత్రుడు లేడు.   158. ఎంత ఉపయోగించినా తర"గని"ది విజ్ఞానం.   159. రేపటి పనిని ఈరోజే చేయాలి.   160. ఇతరులను నువ్వు గౌరవిస్తే, నిన్ను ఇతరులు గౌరవిస్తారు.

Telugu Neetivakyalu - 7

121. మనిషి అకాల౦ - మానవత్వం చిరకాలం. 122. మనసున్న మనుషులే మనకు దేవుళ్ళు. 123. నీరు ప్రాణాధారం - నిజం ధర్మాధారం. 124. పనిపట్ల అభిమానమే విజయానికి రహస్యం.   125. రోజు మనమేధైనామంచి నేర్చుకోవాలి.   126. ఆనందమే ఆస్తి - జీవితానికి అదే దోస్తీ.   127. బధ్దక౦ మనిషికి బధ్దశత్రువు.   128. తప్పును సమర్ధించడం మరో తప్పు.   129. మీ భవిష్యత్తు మీ దినచర్యలొనే ఉంది.   130. మనిషికి శక్తివంతమైన ఆయుధం మాట.   131. మంచి నేర్పాలంటే - మంచి నేర్చుకోవాలి.   132. ఆయుధాల కంటే కోపం చాలా ప్రమాదం.   133. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస.   134. అసాధ్యమనేది మూర్ఖుల నిఘంటువులోని పదం.   135. వినయమే గొప్ప అలంకారం.   136. అనుభవానికి మించిన గురువు లేడు.   137. చక్కనైన గుణం ఆలోచనలో ఉంటుంది.   138. అందం గుణం వల్ల వస్తుంది.   139. ముందు ఆలోచించు - తర్వాత మాట్లాడు.   140. కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు.

Telugu Neetivakyalu - 6

  101. ఆలోచన మనిషికి దేవుడిచ్చిన వరం.   102. అజ్ఞానంకన్నా నిర్లక్ష్యమే ఎక్కువ కీడు చేస్తుంది.   103. దారిద్ర్యానికి మించిన నిస్సహయత ఇం కొక్కటి లేదు.   104. అందర్నీ పొగిడేవాణ్ణి ఎప్పుడు నమ్మొదు.   105. ధర్యే సాహసే లక్ష్మీః !   106. అత్యాశ ప్రాణాంతకం.   107.భావాలు లేని మాటలు గాలి లేని తెరచాపల్లాంటివి   108. ఆపదలలో విచారంకంటే ఓర్పు అవసరం.   109. ఆరోగ్యానికి ప్రధమమూలం ఆనందం.   110. ఇతరుల మీద బురదజల్లెవారు, ఎప్పుడో ఒకప్పుడు తామే బురదలో పడతారు.   111. సుఖశాంతులు సంపదలలో లేవు, సంతృప్తిలో ఉన్నాయి.   112. అందరినీ పొగిడే వ్యక్తీలు ఏ ఒక్కరి మెప్పు పొదలేరు.   113. అన్నం పర బ్రహ్మస్వరుపమ్ .   114. తల్లిదండ్రులు దైవాసమానులు.   115. ప్రశాంతంగా జీవించేవారు అందరికంటే అదృష్టవంతులు.   116. మానవుడి మొదటి శత్రువు బద్ధకం.   117. కోపం సర్వధర్మాలను నశింపచేస్తుంది .   118. సాహసమే సంస్కృతి - మానవతే నాగరికత.   119. మంచిపుస్తకమే మంచి స్నేహితుడు.   120. మంచితనం విత్తు - మానవత్వం పెంచు.

Telugu Neetivakyalu - 5

  81. మంచిమనిషి ఆలోచన ఎప్పుడు వృధా కాదు.   82. త్యాగం మనిషికి ఆభరణం.   83. ఉత్తజం కలిగించేవే ఉత్తమమైన పుస్తకాలు.   84. ప్రతిఫలపెక్షలేని ఏ కార్యమైనా చక్కటి ఫలితా న్నిస్తుంది.   85. మేళిమిబంగరు మెలిక తిరిగినా విలువ తరిగేనా?   86. గెలవా లన్న తపన తగ్గుముఖం పడితే ఓటమికి దగ్గరైనట్లే.   87. నింద నిజమైతే తప్పక దిద్దుకో! అబద్ధమైతే నవ్వేసి ఉరుకో!   88. నిరాడంబరంగా జీవించడం మంచిది.   89. క్షమగుణం అన్నిటికంటే ఉత్తమగుణం.   90. సర్దుబాటు మనస్తత్వం ఉన్నవాడే బతకడంలో బహునేర్పరి.   91. దానం చేస్తున్నాననే అహన్ని విడిచి దానంచేయడం నేర్చుకో!   92. మంచి హృదయం, మంచి ఆలోచన..... ఈ రెండు అద్భుతమైన జోడీ!   93. మౌనానికి మహత్తరశక్తి ఉంది.   94. ప్రతి పనిని ఒక ధ్యానంగా చేయాలి.   95. ద్వేషారహితులే ప్రశాంతంగా జీవించగలుగుతారు.   96. రాబడికి లోబడి బ్రతకాడం నేర్చుకోవాలి.   97. హృదయంలో మలిన్యమ్ ఉన్నవారు ఆరోగ్యవంతులు కాలేరు.   98. పొడుపును మించిన ఆదాయం లేదు.   99. అవకాశాలు ఒక రిచ్చేవి కావు, మనమే వాటికై కృషి చేయాలి.    ...

Telugu Neetivakyalu - 4

  61. బుద్ధిమంతుడు తనకు అన్నీ తెలిసిన తేలీనట్లే ఉంటాడు.   62. అదృష్టాన్ని నమ్ముకోవడం కంటే దైర్యాన్ని నమ్ముకోవడం మంచిది.   63. అపనమ్మకం స్నేహాన్ని చెడగొడుతుంది.   64. అనుభవం ద్వారా జ్ఞానం వస్తుంది.   65. పనిలేని మాటలు ఎవరికి ఇష్టం ఉండవు.   66. నైపుణ్యం కృషి ద్వారానే సాధించవచ్చు.   67. ఎవరి తెలివి తక్కువ వారికి తెలియదు.   68. పెద్దవాళ్ళ అలవాట్లే మిగిలిన వాళ్ళు అనుకరిస్తారు.   69. అపండితునికంటే అర్ధపడితుడే అపాయకరం.   70. ఇరుకు మెదడు మురికిగా ఆలోచిస్తుంది.   71. ఉద్రేకాల్ని అణుచుకోలేని మనిషి వీధిలో కుక్కతో సమానం.   72. కాలం సందేహాలు తీర్చుతుంది.   73. సంబంధాలకంటే అనుబంధాలు గొప్పవి.   74. ఎన్ని జన్మలెత్తిన అమ్మ రుణం తీరదు.   75. పగను వదులుకో - పరిచయం పెంచుకో.    76. అప్పులు చేయుట ప్రాణాంతకం.   77. అక్కరకు వచ్చే మిత్రుడే అసలైన మిత్రుడు.   78. మంచిమాట చెప్పడం కన్నా మంచిపని చేయడం ఉత్తమం.    79. జీవితాన్ని ఆశావహ ధృక్‌పధంతో గడపడం మంచిది.   80. విజయం సాధనతోనే సాధ్యమవుతుంది.

Telugu Neetivakyalu - 3

    41. విజయం పొందాలన్న మనిషి నిరాశపడకూడదు.     42. విజయానికి పునాదివేసేది క్రమశిక్షణ మాత్రమే.     43.ముర్ఖుని వాదనతో జయించడం అసాధ్యం.     44. మార్పులేకుండా ఉండడం ప్రకృతికి, జీవితానికి విరుద్ధం.     45. లక్ష్యం మంచిదైతే నిర్లక్ష్యం చేయకు.     46. ఓర్పు చేదుగా ఉన్నా ఫలితం మధురంగా ఉంటుంది.     47. ఉపకారం చేయలేకపోయినా అపకారం చేయకు.     48. మంచి మాటలు విన్పించుకోని వాడే నిజమైన చెవిటివాడు.     49. మనసుంటే  మార్గముంటుంది.     50. నింద నిజమైతే సరిదిద్దుకోవాలి.     51. నీవు తిన్నది మట్టిపాలు - ఇతరులకు ఇచ్చింది నీ పాలు.     52. చింతలు లేని వాడు సంతలో కూడా నిద్రపోగలడు.     53. కోపానికి బానిస కాకూడదు.     54. సంపదలు ఎన్ని ఉన్న -  శాంతి లేకుంటే సమస్తం సున్న.     55. ఆపదాలో ఆదుకోవడానికి ఆహ్వానం అవసరం లేదు.     56. భోగభాగ్యాలు లేవని చింతించకు - దారిద్ర...

Telugu Neetivakyalu -1

మనిషి బట్టే ఆతడి స్నేహితులు ఉంటారు.  వినయ సంపన్నుడు తనను గురించి తాను ఎప్పుడూ చెప్పుకోడు. బంగారుకు నిప్పు పరీక్షయితే బలమైన మనిషికి ప్రతికూల పరిస్థితే పరీక్ష. నిరాడంబరం కన్నా గొప్పది ఏదీలేదు. గొప్పతనం ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటుంది. అహంభావం చికిత్సకు అందని రోగం. గొప్పవారి గొప్పతనం వారు తమకంటే తక్కువ వారితో వ్యవహరించే తీరును బట్టి తెలుస్తుంది. గౌరవం లేకపోతే ప్రేమ ఎక్కువ కాలం కొనసాగదు. ఆలోచించని వారికి కన్పించేది అంధకరమే. అవసరం వచ్చినప్పుడు అసలు స్నేహితుడెవరొ తెలుస్తుంది. అనామకుడికి కూడా ఓ మంచిరోజు ఉంటుంది. అందరితో మంచిగా ఉండాలనుకోవడం అవకాశవాదమే తప్ప ఆచరణియ౦ కాదు. ఏదో ఒక పని కోసం ప్రారంభమైన స్నేహం చిరకాలం కొనసాగాదు. గతం చూసి గర్వించడం తప్పు. కోపాన్ని శాంతంతో జయించవచ్చు. దుష్టుని మంచితనంతో జయించవచ్చు. దురాశ దుఃఖానికి చేటు. పరధనం పాముతో సమానం. తప్పు చేసినవారికి, అప్పు చేసిన వారికి ముఖ౦ చెల్లదు. నేర్చిన బుద్ధి కాల్చినా పోదు.

Telugu Neeti vakyalu - 2

    21. శ్రమించని మేధావి వర్షించని మేఘ౦.     22. చదువుతో జ్ఞానం - సాదనతో నైపుణ్యం.     23. చీకటి తర్వాత వచ్చిన వెలుగు అమితమైన ఆనందాన్నిస్తుంది.     24. మంచి ప్రారంభం సగం జయం వంటిది.     25. ఓర్వలేనితనానికి హృదయావేదన ప్రధమ శిక్ష.     26. ఒక మౌనం  నూరు మాటల్ని  జయించగలదు.     27. అధిక ప్రసంగం అబద్ధాలకు స్వగృహం.     28. జీవితంలో ప్రతిక్షణానికి విలువ ఉన్నది.     29. సమస్యను గుర్తించామంటే - సగం పరిష్కారమైనట్లే.     30. పొగడ్త పన్నిరులాంటిది. దాన్ని వాసన చూసి వదిలేయాలి గాని తాగుతూ కూర్చోకూడదు.     31. ప్రతి సందేహానికి సమాధానము ఉంటుంది.     32. కష్టాలకు చలించని వాడే స్ధితప్రజ్ఞుడు.     33. నిజం నిప్పులాంటిది - అబద్ధం నీటి బుడగాలంటిది.     34. నాది నాది అనుకున్నది ఎప్పుడు మనది కాదు.     35. గర్వం శత్రువుల్ని పెంచుతుంది.     36. పువ్వ...