Telugu Neetivakyalu - 12
221. మన వ్యక్తిత్వం పరీక్షించబడేది సమస్యల ద్వారానే. 222. తృప్తిలేనివాడు తన ప్రశాంతతను తానే దూరం చేసుకుంటాడు. 223. ఒక చిరునవ్వు మన కష్టాన్ని తొలగిస్తుంది. 224. తక్కువ మాట్లాడు - ఎక్కువ ఆలోచించు. 225. గురువంటే చీకటి తెరల్ని చీల్చే దీపం. 226. ఆపదలు వచ్చినపుడు ఆదుకున్నావారే నిజమైన ఆప్తులు. 227. ఇచ్చింది మరిచిపోవడం, పుచ్చుకొన్నది జ్ఞాపకముంచుకోవటమే నిజమైన స్నేహం. 228. ఏ విషయాన్ని అయినా స్పష్టంగా చూడగలిగిన వ్యక్తి నిజమైన మేధావి. 229. ఒక మనిషి విలువ అతని మాటల నిలకడను బట్టి తెలుస్తుంది. 230. దేనికీ భయపడకు, తప్పు చేయడానికి తప్ప. 231. పరిపూర్ణత అనేది ఆచరణ నుంచే మాత్రమే వస్తుంది. 232. చేరాదిసిన వారినే మింగేస్తుంది 'అసూయ'. 233. చెడుకు ఒక్కక్షణం చాలు - మంచికి జీవితకాలం కూడా చాలదు. 234. జీవితం ఆనందంగా ఉండాలంటే నీకంటే తక్కువ వారితో పోల్చుకో. 235. జీవితం నిరాడంబరంగా...